వాచ్ మేన్ కాదు. కీచకుడు.. మహిళలను వ్యభిచారం చేయమని?

బుధవారం, 20 మే 2020 (18:17 IST)
వాచ్ మేన్ కాదు. కీచకుడు వసతి గృహాలను ఏర్పాటు చేస్తే.. మహిళలను లైంగికంగా వాడుకుని వారిని వ్యభిచారం చేయమని ఒత్తిడి తెచ్చాడు. ఈ ఘటన రాజమండ్రి సమీపంలోని బొమ్మూరు స్వాధార్ వసతి గృహంలో జరిగింది.
 
ప్రభుత్వం నిరాశ్రయులైన మహిళల కోసం ఏర్పాటు చేసిన ఈ వసతి గృహాల్లో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వసతి గృహాల్లో ఉండే మహిళలను జాగ్రత్తగా చూసుకుంటూ వారికి కాపలా ఉండాల్సిన వాచ్ మెన్ కామాంధుడిగా మారాడు.
 
లాక్ డౌన్ సమయంలో నలుగురి మహిళలపై కన్నేసి వారికి మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. నలుగురు మహిళలను శారీరకంగా వాడుకున్న వాచ్ మెన్ రెడ్డిబాబు, తరువాత వారిని వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేశారు. 
 
తమకు జరిగిన అన్యాయం గురించి వార్డెన్ అరుణకు చెప్పగా ఆమె కూడా వాచ్ మెన్‌కు సపోర్ట్ చేసింది. వార్డెన్ అరుణ్ లీవ్ మీద వెళ్లడంతో.. ఆమె స్థానంలో ఇందిర ఈ విషయాన్ని పోలీసులకు చేరవేసింది. బాధిత మహిళల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి వాచ్‌మెన్‌ను అరెస్ట్ చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు