రేప్ చేశారా? ఎంతమంది చేశారూ అంటూ ప్రశ్నలు, బాధితులు ఆందోళన
మంగళవారం, 4 ఆగస్టు 2020 (16:57 IST)
గ్యాంగ్ రేప్‌కు గురైంది. బాధితురాలిని వెంటపెట్టుకుని న్యాయం చేయాలంటూ పోలీస్టేషన్‌కు వచ్చారు. కానీ న్యాయం చేయాల్సిన వ్యక్తే అసభ్యంగా మాట్లాడారు. రేప్ చేశారా.. ఏం చేయమంటావు. ఎంతమంది చేశారు.. ఎలా చేశారంటూ అభస్యంగా మాట్లాడాడు.
దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన బాధితులు పోలీసు స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. కర్నూజిల్లా వెలుగోడు పోలీసు స్టేషన్ ముందు బాధితులకు మద్దతుగా బిజెపి, జనసేన, గిరిజన సంఘాల నేతలు నిరసనకు దిగారు. ఎస్.ఐ. రాజారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
గిరిజన మహిళకు అన్యాయం జరిగితే వెంటనే స్పందించి నిందితులను పట్టుకోవాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ బాధితుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విషయం కాస్త కర్నూలు ఎస్పీ దృష్టికి వెళ్ళడంతో ఎస్.ఐ.కు వార్నింగ్ ఇచ్చారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.