దీంతో తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలను పరిశీలించేందుకు ఏఐసీసీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ మంగళవారం హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన పార్టీ పరిస్థితులపై సమాచారం సేకరించి, పార్టీ సీనియర్ నేతలతో చర్చలు జరుపనున్నారు.
మరోవైపు, టీపీసీసీ అధ్యక్ష పదవికి అనేక మంది పోటీపడుతన్నారు. ఇలాంటి వారిలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ శాసనసభా పక్షనేత మల్లు భట్టు విక్రమార్క, పార్టీ సీనియర్ నేతలు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొన్నాల లక్ష్మయ్య, వీహెచ్, సంపత్ కుమార్‌లు పోటీపడుతున్నట్టు సమాచారం.
అయితే, వీరిలో అందరికంటే ఎక్కువగా రేవంత్ రెడ్డికే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈయన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. పైగా, మల్కాజ్‌గిరి ఎంపీగా కూడా కొనసాగుతున్నారు.