పది రోజుల్లో రెండోసారి వడ్డింపు
ఫిబ్రవరి నెలకు సంబంధించి తొలుత వంట గ్యాస్ ధర రూ.761లుగా నిర్ణయించారు. ఈనెల 4వతేదీన హఠాత్తు గా సిలిండర్‌పై అదనంగా రూ.25లు పెంచారు. తాజాగా పదిరోజులు గడవకనే మరోసారి రూ.50లు పెంచారు. జిల్లా వ్యాప్తంగా 88 గ్యాస్ ఏజెన్సీలు నడుస్తున్నాయి. వీటి పరిధిల్లో 12.30 లక్షల వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి.
ప్రతి రోజూ 22వేల గ్యాస్ సిలిండర్లను డెలివరీ చేస్తున్నారు. ఈ లెక్కన నెలకు 6.60 లక్షల సిలిండర్లు డెలివరీ అవుతు న్నాయి. పాత ధర మేరకు రోజుకు రూ.1.72 కోట్లు, నెలకు రూ.51.87 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. పెంచిన ధర మేరకు రోజుకు రూ.1.83 కోట్లు, నెలకు రూ.55.17 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ లెక్కన నెలకు అదనంగా రూ.3.3 కోట్లు ప్రజలపై భారం పడనుంది.