ఇసుక వ్యాపారి, నల్లకుబేరుడు జే.శేఖర్ రెడ్డిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఇటీవల ఆయన నివాసంలో ఆదాయపన్ను శాఖ అధికారులు నిర్వహించిన సోదాల్లో రూ.కోట్ల నల్లధనం బయటపడిన విషయం తెల్సిందే. ఇందులోభాగంగా రూ.8 కోట్ల కొత్త కరెన్సీని (రూ.2 వేల నోటు) స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు.