Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

దేవీ

శనివారం, 17 మే 2025 (20:30 IST)
Yamadoga re release poster
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మోహన్ బాబు, ప్రియమణి, మమత మోహన్‌దాస్ కాంబినేషన్‌లో వచ్చిన ఐకానిక్ సోషియో ఫాంటసీ ‘యమదొంగ’ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ‘యమదొంగ’ చిత్రాన్ని రీ రిలీజ్ చేయబోతోన్నారు. పుట్టిన రోజు మే 20 కాగా.. అంతకు ముందు నుంచే సంబరాలు ప్రారంభం అవ్వాలని మే 18వ తేదీన ‘యమదొంగ’ చిత్రాన్ని రీ రిలీజ్ చేయబోతోన్నారు.
 
రీ రిలీజ్ కోసం టీం చాలానే కష్టపడింది. యమదొంగ 8Kలో స్కాన్ చేసి 4Kకి కుదించి మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన దృశ్య అనుభవాన్ని కలిగించేలా రెడీ చేశారు. అభిమానులు ఇప్పుడు ఈ సినిమాటిక్ అద్భుతాన్ని మరింత నాణ్యతతో వీక్షించవచ్చు. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో ‘యమదొంగ’ రీ రిలీజ్‌ను మరింత స్పెషల్‌గా మార్చారు.
 
‘యమదొంగ’ రీ రిలీజ్ సందడి సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంది. రీ రిలీజ్‌లో భాగంగా ప్రధాన నటీమణులు ప్రియమణి, మమతా మోహన్‌దాస్ ఇటీవల తమ ఆలోచనలను, షూటింగ్ చేసిన రోజుల్ని తలుచుకుంటూ, ఆ జ్ఞాపకాలను పంచుకుంటూ వదిలిన వీడియోలు అందరినీ ఆకట్టుకున్నాయి. ‘యమదొంగ’ రీ రిలీజ్‌తో రాజమౌళి  విజన్, ఎంఎం కీరవాణి సంగీతాన్ని మరోసారి తెరపై అందరూ వీక్షించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ‘యమదొంగ’ను భారీ ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు