12 అడుగుల భారీ గిరినాగు.. రక్తపింజరను మింగేసింది.. ఎలా పట్టుకున్నారంటే? (video)

సెల్వి

శుక్రవారం, 29 నవంబరు 2024 (11:22 IST)
Snake
అనకాపల్లి జిల్లా మాడుగుల శివారులో భారీ నాగుపాము ప్రజలను భయాందోళనకు గురిచేసింది. 12 అడుగుల భారీ గిరినాగు మాడుగుల ప్రాంతంలో హల్ చల్ చేసింది. ఈ పామును చాకచక్యంగా స్నేక్ క్యాచర్ పట్టుకున్నాడు. 
 
వివరాల్లోకి వెళితే.. ఓ రక్తపింజర పామును వేటాడి మింగేసిన గిరినాగు పొలంలో కనిపించడంతో సదరు రైతు భయపడ్డాడు. ఆపై స్నేక్ క్యాచర్లకు సమాచారం అందించారు. గంట పాటు శ్రమించిన స్నేక్​ స్నాచర్స్​ గిరినాగును బంధించి దట్టమైన అటవీ ప్రాంతంలో విడిచి పెట్టారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. 
 
ఇంత పెద్ద గిరినాగు ఈ ప్రాంతంలో ఎప్పుడు చూడలేదని స్థానికులు అంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

వామ్మో... 12 అడుగుల భారీ గిరినాగు హల్‌చల్

అనకాపల్లి జిల్లా మాడుగుల శివారులోని ఓ రైతు పొలంలో కనిపించిన భారీ గిరినాగు

ఓ రక్తపింజర పామును వేటాడి మింగేసిన గిరినాగు

చాకచక్యంగా పట్టుకుని బంధించిన స్నేక్ స్నాచర్ #Anakapalle #Snake #Bigtv pic.twitter.com/Ep21auY90u

— BIG TV Breaking News (@bigtvtelugu) November 29, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు