ఈ వివరాలను పరిశీలిస్తే, కోటబొమ్మాళి మండలం నిమ్మాడ జంక్షన్‌కు చెందిన దండాశి అప్పలనాయుడుకు, ఉర్జాం గ్రామానికి చెందిన జయలక్ష్మితో 2004లో పెళ్లి జరిగింది. వీరికి ఓ కుమార్తె కూడా ఉంది. అప్పల నాయుడు పెళ్లికి ముందు ఓ ఫోటో స్టూడియోలో అసిస్టెంట్‌గా పని చేస్తూ ఉండేవాడు. ఆ తర్వాత వ్యసనాలకు బానిసగామారి అనారోగ్యానికిగురై గతకాలంగా ఇంటిపట్టునే ఉంటున్నాడు. దీనికితోడు అప్పలనాయుడు భార్యపై అనుమానంతో తరచూకొట్టేవాడు.
ఈ విషయాన్ని జయలక్ష్మి కన్నవారైన ఉర్జాంలోని తన సోదరులు జలుమూరు అప్పన్న, రాంబాబులకు చెప్పి బాధపడేది. ఈ నెల 12న బావను ఉర్జాంలోని తమ ఇంటికి పిలిపించి బావ మరుదులిద్దరూ మందలించే ప్రయత్నం చేసి.. ఆయనపై చేయి చేసుకున్నారు.