అమెరికాలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) బోర్డు డైరెక్టర్ డాక్టర్ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ యాదవ్ భార్య, ఆయన ఇద్దరు కుమార్తెలు దుర్మరణం పాలయ్యారు. కుమార్తెను కాలేజీ నుంచి తీసుకొస్తుండగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రమాద స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఒకేసారి భార్యాపిల్లలు ఇకలేరన్న వార్త తెలియగానే కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ షాక్‌లోకి వెళ్లిపోయారు.
ఈ నేపథ్యంలో శ్రీనివాస్ భార్య యలమంచిలి వాణి ఆదివారం ఉదయం 11.30 గంటలకు కాలేజీ తన ఇద్దరు కుమార్తెలను తీసుకొచ్చేందుకు కారులో వెళ్లారు. కాలేజీ నుంచి వారిద్దరిని కారులో ఎక్కించుకుని బయలుదేరారు. వీరి కారు టెక్సాస్ వాలర్ కౌంటీలో వస్తుండగా కారును ఓ వ్యాను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
వాణి ఐటీ ఉద్యోగి కాగా, పెద్ద కుమార్తె వైద్య విద్యను అభ్యసిస్తుంది. రెండో అమ్మాయి 11వ తరగతి చదువుతోంది. ప్రమాదంలో భార్య, ఇద్దరు కుమార్తెలు దుర్మరణం పాలయ్యారన్న వార్త తెలుసుకున్న నాగేంద్ర శ్రీనివాస్ షాక్‌లోకి వెళ్లిపోయారు. సమచారం తెలుసుకున్న తానా సభ్యులు, సన్నహితులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తి వ్యక్తం చేస్తూ, మిగిలిన కార్యక్రమాలను పూర్తి చేసే పనుల్లో నిమగ్నమయ్యారు.