వైకాపాకు షాకిచ్చిన ఎమ్మెల్యే - పదవికి రాజీనామా

ఆదివారం, 5 జూన్ 2022 (11:40 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో వైకాపా చిత్తుగా ఓడిపోవడం ఖాయమనే సంకేతాలు ఇప్పటినుంచే వస్తున్నాయి. దీంతో ఆ పార్టీకి చెందిన నేతలు ఇపుడిపుడే నిద్ర లేస్తున్నారు. పార్టీలోని అసమ్మతి నేతలు బహాటంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. మరికొందరు తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. 
 
ఈ క్రమంలో తాజాగా వైకాపాకు సొంత పార్టీ ఎమ్మెల్యే ఒకరు షాకిచ్చారు. విశాఖ సౌత్ శాసన సభ్యుడు వాసుపల్లి గణేష్ గత ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచారు. ఆ తర్వాత వైకాపాలో చేరారు. ప్రస్తుతం విశాఖ సౌత్ నియోజకవర్గం సమన్వయకర్తగా ఉన్నారు. అయితే పార్టీలోని అంతర్గత పోరు వల్ల సమన్వయకర్త పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఆయన విశాఖ, అనకాపల్లి, మన్యం జిల్లాల వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డికి తన నిర్ణయాన్ని తెలియజేస్తూ లేఖ రాశారు. 
 
ప్రాంతీయ సమన్వయకర్తగా విశాఖకు వచ్చిన తొలి రోజేన తనకు శల్య పరీక్ష ఎదురైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన గౌరవానికి భంగం కలిగినట్టుగా భావిస్తున్నట్టు తెలిపారు. పైగా, టీడీపీలో ఉన్నపుడే తనకు మంచి గౌరవ మర్యాదలు లభించాయని పేర్కొన్నారు. తనపై వైకాపా పార్టీ కార్యాలయంలో జరిగిన పంచాయతీపై చింతిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు