కరివేపాకులా మారిపోయాం- ఎంపీలుగా చేసిందేమీ లేదు: జేసీ దివాకర్ రెడ్డి

గురువారం, 28 డిశెంబరు 2017 (09:16 IST)
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వంపై జేసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వంలో తమ పరిస్థితి కరివేపాకులా తయారైందన్నారు.
 

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ప్రస్తుతం ఏ పార్టీ దయాదాక్షిణ్యాలు అవసరం లేదు. ఆయన ఫుల్ మెజారిటీతో వున్నారు. అందుకే కరివేపాకులా టీడీపీ మారిపోయిందన్నారు.  
 
సాధారణంగా కూర వండేటప్పుడు అంద‌రూ క‌రివేపాకును వేస్తారు.. కానీ, తినేట‌ప్పుడు మాత్రం మొట్ట‌మొద‌ట తీసి పారేసేది కూడా క‌రివేపాకునే. ఆ ర‌కంగా తమ పరిస్థితి మారిపోయిందన్నారు. కేంద్రంలో తమ పార్టీ ఎలాంటి ప్రాధాన్యత లేదు. వాళ్లు చేయి ఎత్తమంటే ఎత్తుతున్నాం. దించమంటే దించుతున్నామని జేసీ కీలక వ్యాఖ్యలు చేశారు.
 
మోదీ ప్రభుత్వం ఫుల్ మెజారిటీతో వుండటం ద్వారా ప్రత్యేక హోదా గురించి మాట్లాడనివ్వరు. రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేస్తోన్న అభివృద్ధి పనులను చెప్పుకుని తాము ఎన్నికల్లో గెలవాల్సిందే తప్ప.. ఎంపీలుగా తామేమీ చేసింది లేదన్నారు. ఎంపీలుగా ఏదో చేసేశామని చెప్పుకునే పరిస్థితి లేదని జేసీ క్లారిటీ ఇచ్చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు