పవన్ కల్యాణ్‌కు తిక్కలేదు, లెక్క మాత్రం వుంది: జేసీ కుమారుడు

సోమవారం, 4 డిశెంబరు 2017 (13:21 IST)
తెలుగుదేశం పార్టీ నేత జేసీ దివాకర్ రెడ్డి తన కుమారుడు జేసీ పవన్ రెడ్డిని అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దించాలనుకుంటే.. పవన్ రెడ్డి మాత్రం ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. తనకు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగే ఆలోచన లేదని.. ఎంపీ అయితే ఎక్కువ మంది ప్రజలకు సేవ చేయవచ్చునని పవన్ రెడ్డి తెలిపారు. 
 
రాజకీయాలు మరో ఏడాదిన్నరలో ఎంతో మారనున్నాయని, అనంతపురం, తాడిపత్రి, హిందూపురం తదితర నియోజకవర్గాల్లో మార్పులు సహజమన్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ తనకు మంచి మిత్రుడన్నారు. తన తండ్రి జేసీ అన్నా ఆయను అభిమానం వుందని చెప్పుకొచ్చారు. ఆయనకు ఎప్పటిక రుణపడి వుంటామని.. కానీ కొంతకాలం నుంచి ఆయనతో మాట్లాడలేదన్నారు. పవన్ కల్యాణ్‌కు తిక్కలేదని, లెక్క మాత్రం ఉందని తెలిపారు. 
 
జనసేన స్వతంత్ర్యంగా పోటీ చేస్తుందా? లేకుంటే మరేదైనా పార్టీతో పెట్టుకుంటుందా అనేది తెలియదని.. పొత్త పెట్టుకుంటే సీట్లన్నీ జనసేనకు వెళతాయని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అందుకే అసెంబ్లీ సెగ్మెంట్‌పై కాకుండా, పార్లమెంట్ సెగ్మెంట్ పైనే దృష్టిని పెట్టానని అన్నారు. తాను అడిగానని అనంతపురంలో మీటింగ్ పెట్టారని, ఆయన చాలా స్మార్ట్ అని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు