అంతేకాక తెలుగు దేశం పార్టీలో ఉంటూ కో వర్టులుగా వ్వవహరించే వారిని గుర్తించి బయటకు పంపటం జరుగుతుంది అన్నారు. అన్నింటి కంటే ముందు పార్టీ సంస్థాగతంగా బాగుండాలి అంటే మంచి వ్యక్తులను అధ్యక్ష, కార్యదర్శులుగా ఎన్నుకోవాలని సూచించారు.
టీడీపీ సంస్థాగత ఎన్నికల్లో ఎవ్వరి సిఫార్సులు పనిచేయవని కార్యకర్తల అభిప్రాయం మేరకు పదవులు వరిస్తాయని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నపుడే నాయకుడుగా ఎదిగే అవకాశం ఉంటుంది అన్నారు. గ్రామ ప్రజలతో మమేకమై పార్టీని బలోపేతం చేయడానికి యువత ముందుకు రావాలని, ఈ సంస్థాగత ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యత ఉంటుంది అన్నారు.