3 రాజధానుల నిర్ణయం రైటా? రాంగా? ది హిందూ బిజినెస్ లైన్ సర్వే ఏం చెప్పింది?

శుక్రవారం, 7 ఫిబ్రవరి 2020 (12:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా రాజధాని అమరావతి ప్రాంత రైతులు గత 52 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో ప్రముఖ ఆంగ్ల పత్రిక ది హిందూ గ్రూపునకు చెందిన ది హిందూ బిజినైన్ ఆంగ్ల వెబ్‌సైట్ ఓ సర్వే నిర్వహించింది. మూడు రాజధానుల ఏర్పాటుపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం తెలివైనదేనా? అని ఓ సర్వే చేపట్టింది.
 
ఈ సర్వే గత డిసెంబరు 28వ తేదీన చేపట్టగా, గురువారం రాత్రి వరకు మొత్తం 3,18,348 మంది స్పందించి, తమ ఓటు వేశారు. ఈ సర్వేలో పాల్గొన్నవారిలో కేవలం 83 మంది నెటిజన్లు మాత్రమే మూడు రాజధానుల నిర్ణయం సరైనదంటూ అభిప్రాయపడ్డారు. మిగిలినవారంతా మూడు రాజధానుల అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. 'టుడేస్‌ పోల్' అనే శీర్షికతో ఈ వెబ్‌సైట్ ఎప్పటికప్పుడు ఒక్కో అంశంపై సర్వే నిర్వహిస్తూ వస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు