తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఎన్ఫోర్స్మెంట్, ఎక్సైజ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో ఎక్కడా ఇసుక అక్రమ రవాణా, మద్యం అక్రమ తయారీ ఉండకూడదని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు.
ఎన్ఫోర్స్మెంట్, ప్రొహిబిషన్, ఎక్సైజ్‌శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి, సీఎస్ నీలం సాహ్ని పాల్గొన్నారు. గ్రామాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ బెల్టుషాపులు నడవకూడదని సీఎం నిర్దేశించారు. ఎలాంటి సందర్బంలోనూ ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా జరగకూడదన్నారు.