తిరుపతి-గుంటూరు ఎక్స్ప్రెస్లో ఒక షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. దొంగల ముఠా అర్ధరాత్రి దోపిడీ సమయంలో ప్రయాణికులపై దాడి చేశారు. ఈ ఘటన ప్రయాణీకులను భయాందోళనలకు గురిచేసింది. వాస్తవానికి తిరుపతి నుంచి రాత్రి 7:30 గంటలకు బయలుదేరాల్సిన రైలు గంట ఆలస్యమవడంతో నేరస్తులు తమ అసాంఘిక కార్యకలాపాలకు మార్గం సుగమం చేశారు.