శ్రీవారి భక్తులకు శుభవార్త.. రూ.10వేలు విరాళంగా ఇస్తే?

శనివారం, 20 జులై 2019 (11:21 IST)
శ్రీవారి భక్తులకు ఓ శుభవార్త. వీఐపీ దర్శనం ఇక సామాన్యులకు లభించనుంది. అయితే కాస్త ఖర్చుతో కూడుకున్న పనిగా మారనుంది. ఇందులో భాగంగా రూ.10 వేలు విరాళంగా చెల్లించిన ప్రతి ఒక్కరికీ ఈ అవకాశం కల్పించాలని దేవస్థానం అధికారులు నిర్ణయించారు. 
 
సమస్య లేకుండా సామాన్య భక్తులు కూడా వీఐపీ బ్రేక్‌ దర్శనం చేసుకుని స్వామిని తనివితీరా చూసుకునే అవకాశం ఈ పథకం ద్వారా కల్పించాలని భావిస్తోంది. దీంతో దివ్యమంగళ స్వరూపాన్ని చూసే భాగ్యం సామాన్య ప్రజలకు కూడా కల్పించేందుకు టీటీడీ రంగం సిద్ధం చేస్తోంది. 
 
టీటీడీ శ్రీవాణి పథకంలో భాగంగా బ్రేక్‌ దర్శనం టికెట్లు కేటాయించే యోచనలో ఉన్నట్లు టీటీడీ ఈఓ సింఘాల్‌ తెలిపారు. ఇప్పటి వరకు ఈ పథకంలో రూ.10 లక్షలు, ఆపైన చెల్లించిన వారికి బ్రేక్‌ దర్శనం లభిస్తోంది. ఇలా లభిస్తున్న నిధులను దేశవ్యాప్తంగా శ్రీవారి ఆలయాల నిర్మాణానికి టీటీడీ ఖర్చు చేస్తోంది. తాజా నిర్ణయంతో ఈ పథకానికి నిధులు వెల్లువెత్తుతాయని భావిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు