బాలకాండలోని 3 నుండి 7 సర్గల వరకు గల 142 శ్లోకాలను పారాయణం చేస్తారు. ఎస్.వి. వేద విఙ్ఞాన పీఠం, ఎస్.వి. వేద విశ్వవిద్యాలయం, టిటిడి వేదపండితులు, టిటిడి సంభావన పండితులు, శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయాల అధికారులు, పండితులు, అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
కాగా, కరోనా వైరస్ నశించాలని కోరుతూ 2020, జూన్ 11న సుందరకాండ పారాయణం ప్రారంభమైంది. 2021 జులై 24 వరకు ఈ కార్యక్రమం కొనసాగింది. ఆ తరువాత కరోనా వైరస్ మూడో దశలో పిల్లలపై ఎలాంటి ప్రభావం పడకుండా స్వామివారిని ప్రార్థిస్తూ 2021 జులై 25వ తేదీ నుండి బాలకాండ పారాయణాన్ని టిటిడి ప్రారంభించింది.