చిత్తూరులో రోడ్డు ప్రమాదం - తెదేపా నేతల దుర్మరణం

బుధవారం, 24 ఆగస్టు 2022 (10:54 IST)
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు నేతలు ప్రాణాలు కోల్పోయారు. మృతులను భానుప్రకాష్ రెడ్డి, గంగపల్లి భాస్కర్‌గా గుర్తించారు. మరో నేత సోమశేఖర్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. 
 
చిత్తూరు జిల్లా పరిధిలో మంగళవారం ఈ ప్రమాదం జరిగింది. ఇందులో చంద్రగిరి మండలం తెలుగు యువత అధ్యక్షుడు భాను ప్రకాష్ రెడ్డి, చిత్తూరు పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి గంగపల్లి భాస్కర్‌లు ప్రమాద స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. వారితో పాటు అదే కారులో ప్రయాణిస్తున్న ఐటీడీపీ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ సోమశేఖర్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. 
 
ఈ ప్రమాద వార్త తెలియగానే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం తనను తీవ్ర  దిగ్భ్రాంతికి గురిచేసిందని, గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సోమశేఖర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు