ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ ఆలయాలకు, వాటి రథాలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయింది. గత రెండున్నరేళ్ళ కాలంలోనే వందల సంఖ్యలో హిందూ ఆలయాలు ధ్వంసానికి గురయ్యాయి.
ఆలయ గోశాల పక్కన ఉంచిన ఈ రథ చక్రాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదం సమాచారం తెలుసుకున్న అగ్నిమాపకదళ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేసినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే, ఇది గుర్తు తెలియని వ్యక్తులు చేశారా లేదా ఎవరైనా ఉద్దేశ్యపూర్వకంగా చేశారా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.