ఒంటరిగా ఉన్న మహిళను టార్గెట్ చేసుకుని ఆమెను చంపేందుకు దుండగులు ప్రయత్నించారు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి మండలం సుర్ధపల్లిలో చోటు చేసుకుంది. కరెంటు షాక్ పెట్టి మహిళను హతమార్చేందుకు దుండగులు ప్రయత్నించారు. అర్థరాత్రి సమయంలో మహిళ ఇంటి చుట్టూ ఇనుపతీగలను చుట్టి విద్యుత్ సరఫరా చేసారు.