చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

ఠాగూర్

బుధవారం, 30 జులై 2025 (12:33 IST)
మెగాస్టార్ చిరంజీవి టిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం విశ్వంభర. వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారనే వార్త ఇపుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీనిపై ఆ చిత్ర దర్శకుడు వశిష్ట స్పందించారు. 
 
ఈ చిత్రంలో ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారంటూ ప్రచారం సాగుతోది. వాస్తవానికి త్రిష మెయిన్ హీరోయిన్. ఆషిక రెండో హీరోయిన్. వీరిద్దరు మాత్రమే హీరోయిన్లు. కానీ, ఐదుగురు కథానాయికలు నటిస్తున్నారన్న వార్త ఎలా బయటకు వచ్చిందో తనకు తెలియదన్నారు. 
 
అలాగే, విడిగా నటీమణులు కొన్ని పాత్రల్లో కనిపిస్తారు. స్క్రీన్‌పై వీళ్లందరూ చాలా ఫ్రెష్‌గా ఉంటారు. వీఎఫ్ఎక్స్ వర్క్ కారణంగానే దీని విడుదల ఆలస్యమవుతుంది. ఈ చిత్రం, అనిల్ రావిపూడి - చిరంజీవి కాంబోలో రానున్న సినిమా రెండూ విభిన్నమైనవి. అందుకే నాకు టెన్షన్ లేదు" అని చెప్పారు. ఇక ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.
 
మరోవైపు ఈ చిత్రం టీజర్‌పై ఆయన స్పందిస్తూ, 'అవతార్‌కు కాపీ అంటూ ట్రోల్స్ వస్తున్నాయి. ఈ టీజర్ నాకు నచ్చింది. అందువల్ల టీలీజ్ చేశాను. అందులో కనిపించిన పాప కాస్ట్యూమ్‌ను చూసి అందరూ నేను అవతార్ సినిమా కాపీ చేసి దాన్ని రూపొందించానని అన్నారు. టీజరులో కనిపించిన కొండలు, ఆ పాప చెవులు చూసి అలా భావించారు. 
 
కానీ, కొండలను 'అవతార్' కంటే ముందు ఎన్నో సినిమాల్లో చూపించారు. ఇక చెవులు కూడా పెద్దగా ఉండడం గతంలో చాలా సినిమాల్లోని పాత్రల్లో చూపారు. నేను చందమామ కథలు చూసి స్ఫూర్తి పొంది అలా కాస్ట్యూమ్ డిజైన్ చేయించాను. అవతార్ చూసి కాపీ కొట్టాను అనే బదులు ఈ కథలను చూసి కాపీ కొట్టాను అంటే చాలా ఆనందించేవాడిని. చందమామ కథల్లో జ్వాలాదీపం అనే సిరీస్ ఉంటుంది. అందులో ఉన్నవే అవతార్‌లో చూపించారు అని వివరణ ఇచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు