తన ఇంటి కంటే దేవాలయం ఎత్తు పెరిగితే తనకు వాస్తు ప్రకారం ఇబ్బంది అని భావించిన ప్రతాప్ రెడ్డి అనే పెత్తందారు గర్భగుడి ద్వారానికి గోడ కట్టించాడు. దీంతో పూజలు ఆగిపోయాయి. స్థానికంగా పోలీసులు వచ్చినా తనకున్న రాజకీయ పలుకుబడితో వారిని నిలువరించాడు. చివరకు గ్రామస్తులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం.