అది విజయనగరం జిల్లాలోని గరుగుబిల్లి ఎంపీడీవో కార్యాలయం. అక్కడ డ్యాన్స్ బేబీ డ్యాన్స్. కాదు.. కాదు, అంతకంటే ఎక్కువే. రగులుతోంది మొగలిపొద అంటూ పాటల్లో ఊగిపోయారు. ఫ్లోర్‌పై పడుకుని పైత్యం ప్రదర్శించారు. ఈ దృశ్యాలను చూసిన స్థానికులు హడలిపోయారు.
ఎంపీడీవో చంద్రరావు, కంప్యూటర్ ఆపరేటర్ సింహాచలం పిచ్చివేషాలు, వికృత చేష్టలతో ఆ కార్యాలయంలో కాలు పెట్టాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. వీరిద్దరి వికృత చేష్టలు విస్తు గొలుపుతున్నాయి.
పనివేళల్లో తోటి ఉద్యోగితో చేసిన నృత్యాలు, మద్యం మత్తులో చేసిన అసభ్యకర ప్రవర్తన ఆలస్యంగా వెలుగు చూశాయి. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో జిల్లా కలెక్టర్ సూర్యకుమారి స్పందించారు.