ఓటరు ఐడీకి ఆధార్ లింక్ చేయవద్దని ప్రతిపక్ష ఎంపీలు చేస్తున్ననిరసనల మధ్యే, మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందినట్లు సభాపతి ప్రకటన చేశారు. ఓటర్ ఐడీకి ఆధార్ అనుసంధానంతోపాటు ఇకపై ఏటా నాలుగు సార్లు ఓటరు నమోదు, మహిళా సర్వీస్ అధికారిణిల భర్తలకూ పోస్టల్ బ్యాలెట్ సదుపాయం, ఎన్నికల కమిషన్ పరిధిని విస్తృతం చేసే కీలక అంశాలు బిల్లులో ఉన్నాయి.
మిగతా మూడు అంశాలపై ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాకున్నా, ఓటరు జాబితాకు ఆధార్ అనుసంధానాన్ని మాత్రం ప్రతిపక్ష పార్టీలు ముక్తకంఠంతో వ్యతిరేకించాయి. దీని వల్ల ఓటరు అస్తిత్వానికి, గోప్యతకు ముప్పు కలుగుతుందని ప్రతిపక్ష నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.