రిటైర్డు జడ్జికి ఆ మాత్రం తెలియదా..? మంత్రి పత్తిపాటి ప్రశ్న.... ఏమాత్రం..?

బుధవారం, 1 జులై 2015 (08:10 IST)
రిటైర్డు జడ్జి అయిన ఆయనకు ఆ మాత్రం తెలియదా...? సెక్షన్ 8 హైదరాబాద్ లో అవసరమా లేదా అనే విషయం ఆయనకు అర్థం కాదు. తమిళనాడు పోలీసుల్ని ఏపీలో అనుమతిస్తారా? అనే వితండవాదాన్ని ఎలా తెస్తారని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు.  ఈ విషయంలో గవర్నర్‌ సత్వరమే నిర్ణయం తీసుకోవాలని కోరారు. 
 
తమిళనాడు పోలీసుల్ని ఏపీలో అనుమతిస్తారా? అని ఒక రిటైర్డ్‌ జడ్జి ప్రశ్నించారని, తమిళనాడుకు-ఏపీకి ఉమ్మడి రాజధాని ఉందా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌ ఏపీ, తెలంగాణలకు ఉమ్మడి రాజధాని కాబట్టి, అక్కడ తమకూ సమాన హక్కులు ఉన్నాయి కాబట్టే, అక్కడ పోలీసుల్ని పెట్టుకుంటుమన్నామని తెలిపారు. తమిళనాడు, ఏపీలకు ఉమ్మడి రాజధాని ఏపీలో ఉంటే అప్పుడు తమిళనాడు పోలీసుల్ని అనుమతించటంలో తప్పు లేదన్నారు. 
 
న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తికి ఈమాత్రం తెలియదా? అని ప్రశ్నించారు. సెక్షన్‌-8పై వివాదం మంచిది కాదనే ఏడాదిపాటు సహనంతో ఉన్నామని, అయినా సెక్షన్‌ 8 అమలు కాకపోవటంతో మాట్లాడాల్సి వస్తోందని చెప్పారు.  మరో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడతూ సెక్షన్‌-8 ప్రకారం ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ పదేళ్లపాటు ఉంటుందని చెప్పారు. సెక్షన్‌-8 అమలు పరచకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. లేదంటే కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని ఒత్తిడి చేస్తామని చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి