ప్రత్యేక హోదాను జగన్‌రెడ్డి ఎప్పుడు సాధిస్తారు?: చంద్రబాబు

శుక్రవారం, 28 మే 2021 (20:48 IST)
ప్రత్యేక హోదాపై జగన్‌రెడ్డి కనీసం నోరు మెదపట్లేదని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. మహానాడు చంద్రబాబు మాట్లాడుతూ ‘‘హోదా వస్తే ఉద్యోగాలు వస్తాయి, అభివృద్ధి జరుగుతుందన్నారు.

25 మంది ఎంపీలను ఇస్తే హోదా సాధిస్తానన్నారు. ప్రత్యేక హోదాను జగన్‌రెడ్డి ఎప్పుడు సాధిస్తారు? పోలవరంను ఎప్పుడు పూర్తి చేస్తారు? రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్, విభజన హామీలను.. ఎప్పటిలోగా అమలు చేస్తారో శ్వేతపత్రం విడుదల చేయాలి.

మాట తప్పిన జగన్‌రెడ్డి సమాధానం చెప్పాలి. లేకపోతే ఆ రోజు చేసింది తప్పని జగన్‌రెడ్డి క్షమాపణ చెప్పాలి. వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలి’’ అని చంద్రబాబు డిమాండ్ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు