పవన్ కళ్యాణ్, నటి ప్రియాంక మోహన్‌లపై చిత్రీకరించబడిన ఈ పాటను దాదాపు రెండు సంవత్సరాల క్రితం చిత్రీకరించారు. ప్రియాంక ఎక్స్‌లో ఈ ట్రాక్ పట్ల తనకున్న చిరకాల ప్రేమను వ్యక్తం చేస్తూ, "నేను గత రెండు సంవత్సరాలుగా ఈ పాటకు బానిసయ్యాను, ఇప్పుడు అది చివరకు విడుదలైనందున, మీరందరూ నాలాగే దీన్ని ఇష్టపడతారని నేను ఆశిస్తున్నాను" అని రాసింది.
ఇకపోతే.. ఓజీని సుజీత్ దర్శకత్వం వహించారు. ఇది సెప్టెంబర్ 25, 2025న థియేటర్లలో విడుదల కానుంది. హరిహర వీరమల్లు లాంటి డిజాస్టార్ తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్). ఈ సినిమాకు రన్ రాజా రన్, సాహో చిత్రాలతో స్టార్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సుజిత్ సైన్ దర్శకత్వం వహిస్తున్నాడు. జపాన్ బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్ కథాంశంతో ఈ సినిమా సిద్ధమవుతుంది.