భర్తతో కాపురం చేయలేకపోయింది భార్య. తరచూ ఇంట్లో భర్త లేకపోవడం.. పనిమీద బయటకు తిరుగుతుండడంతో ఆమెకు ఎంత మాత్రం ఇష్టం లేకుండా పోయింది. పెళ్ళయి రెండు సంవత్సరాలు అవుతున్నా భర్త తనతో సంసార జీవితం సరిగ్గా చేయకపోవడంతో విరహం తట్టుకోలేకపోయింది. ఇక చేసేది లేక ఒక వైద్యుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆ సంబంధాన్ని కొనసాగించేందుకు భర్తను చంపించేసింది.
నా భర్త ఎప్పుడూ జెసీబీలు, ట్రాక్టర్లు తోలుకుంటూ తిరుగుతూ ఉంటాడు. ఇంటి పట్టున ఉండడు. ఇంటికి వచ్చినా నన్ను పట్టించుకోడు. అందుకే అతడిని చంపించాను. నేనే డాక్టర్‌కు చెప్పాను. నరాల ఇంజక్షన్ ఇచ్చి చంపేయమన్నానని పోలీసులకు అసలు విషయాన్ని చెప్పేసింది.