శుభం చిత్రంలో ప్రతిభావంతులైన నటీనటులు అద్భుతమైన నటనతో కథలోని పాత్రలకు జీవం పోశారు. అన్నీ వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా నవ్విస్తూ, థ్రిల్లింగ్ సన్నివేశాలతో మెప్పిస్తూ పూర్తి వినోదాత్మక కుటుంబ కథా చిత్రంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. వివేక్ సాగర్ అద్భుతమైన సంగీతం మరింత ఆసక్తిని పెంచుతోంది. ఈ వేసవిలోనే సినిమాను విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు
నటీనటులు: హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియా కొంతం, శ్రావణి లక్ష్మి, షాలిని కొండెపూడి, వంశీధర్ గౌడ్ తదితరులు
సాంకేతిక వర్గం: దర్శకత్వం: ప‌్రవీణ్ కండ్రెగుల, కథ: వసంత్ మారింగంటి, ఎడిటింగ్, ధర్మేంద్ర కాకరాల, సినిమాటోగ్రఫీ: మద్రుల్ సుజిత్ సేన్, సంగీతం: సెరెజొ, బ్యాగ్రౌండ్ స్కోర్: వివేక్ సాగర్, వి.ఎఫ్.ఎక్స్ సూపర్‌వైజర్: నిఖిల్ కోడూరు, లైన్ ప్రొడ్యూసర్: ఆర్యన్ దగ్గుబాటి, పాటలు: రహమాన్