అసెంబ్లీలో వార్ : జగన్‌ను రఫాడించేసిన మంత్రులు!

బుధవారం, 20 ఆగస్టు 2014 (12:06 IST)
ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలపై చర్చ జరపాలంటూ సభా కార్యక్రమాలను అడ్డుకున్న జగన్ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్‌పై అధికార పక్షం తెలుగుదేశం పార్టీ మండిపడింది. శాంతిభద్రతలపై ప్రభుత్వానికి లెక్కేలేదని మనుషుల ప్రాణాలంటే అధికార పార్టీకి లెక్కలేదని వైకాపా చీఫ్ జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రివర్యులు మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డిని అసెంబ్లీలో ఏపీ మంత్రులు రఫ్ ఆడించేశారు.
 
ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా జగన్ మారలేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ప్రజా సమస్యలు జగన్‌కు పట్టడం లేదని ఆయన అన్నారు. వైసిపి లాంటి ప్రతిపక్షాన్ని ఏపి చరిత్రలో చూడలేదన్నారు. పది శాతం కమిషన్ అనేది జగన్‌కు అలవాటుగా మారిందని, అందుకే లక్ష కోట్ల విషయంలో పది శాతం కమిషన్ ఇస్తానని అన్నారన్నారు.

వెబ్దునియా పై చదవండి