అధ్భుతమైన అవకాశాన్ని విదేశీ మంత్రిత్వ శాఖ ఇప్పుడు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆధార్ కార్డ్ ఉంటే చాలు. కేవలం 10 రోజుల్లోనే పాస్‌పోర్ట్ మీ చేతికి వస్తుంది. ఇప్పుడు పాస్‌పోర్ట్ కోసం నెలల తరబడివేచి చూసే రోజులు పోయాయి. ఇంతకు ముందులాగా పోలీస్ వెరిఫికేషన్ లాంటివి ఏమీ లేకుండా డైరక్టుగా మీ ఇంటికి 10 రోజుల్లో పాస్‌పోర్ట్ వస్తుంది. తరువాత పోలీస్ వెరిఫికేషన్ కోసం వస్తారని ప్రభుత్వం చెబుతోంది. మరి అదెలాగో చూద్దాం.
ఆధార్ కార్డు సమాచారాన్ని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోతో అనుసంధానం చేశారు. ప్రస్తుతం పాస్‌పోర్టుల జారీ విషయంలో పోలీసు ధృవీకరణ ఆలస్యం అవుతుండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. తాజా ఫార్మెట్‌లో దరఖాస్తుదారు ఆన్లైన్‌లో చేసుకోవాల్సి ఉంది. గుర్తింపు మరియు చిరునామా కింద ఆధార్ కార్డు తప్పనిసరి. కొత్త, తత్కాల్ పాస్‌పోర్టులకు దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారుని పౌరసత్వం, నేర పూర్వాపరాలు, నేరారోపణలను లాంటి వాటిని పోలీసు తర్వాత ధృవీకరించనున్నారు. ఇలా చేయడం వల్ల దరఖాస్తుదారుని గత నేర చరిత్ర ధ్రువీకరణ కోసం గుర్తింపుగా ఆధార్ కార్డును వినియోగించనున్నట్లు శాఖ అధికారి తెలిపారు.
దరఖాస్తు చేసుకున్న మూడు రోజుల్లో దరఖాస్తుదారు అపాయింట్మెంట్ పొందుతారు. మరొక ఏడు రోజుల్లో, పాస్‌పోర్ట్‌ని ప్రాసెస్ చేసి ఇంటికి పంపడం జరుగుతుంది. ఆ తర్వాత పోలీసు ధృవీకరణ కోసం ఇంటికి వస్తారు. పాస్‌పోర్టు జారీల విషయంలో జరుగుతున్న ఆలస్యాన్ని అధిగమించడానికి ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం, ఇంటిలిజెన్స్ బ్యూరో విభాగంతో పాటు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధార్ కార్డుని తప్పనిసరి చేసింది. దీనిని అమలు చేసేందుకు యుఐడిఎఐతో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమన్వయం చేసుకుంటుంది.