మంగళవారం నాడు తన ప్రచారం నిమిత్తం ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ తెలుగు రాష్ట్రాలకు విచ్చేశారు. తొలుత తెలంగాణకు ఆయన వచ్చిన సందర్భంగా.. ఆయనతో బంజారాహిల్స్ రోడ్ నం.1 పార్క్ హయత్ హోటల్‌లో ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు.