చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సిహెచ్

శనివారం, 12 జులై 2025 (23:20 IST)
ఇప్పుడు చాలామందిని ఇబ్బందిపెట్టే సమస్యల్లో చెడుకొవ్వు లేదా LDL ఒకటి. ఈ కొవ్వు స్థాయిలు పెరిగితే రకరకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. వాటిలో ప్రధానమైది గుండె సమస్య. కనుక చెడు కొవ్వు స్థాయిలు పెరగకుండా చేసే కొన్ని పానీయాలు వున్నాయి. అవేంటో తెలుసుకుందాము.
 
గ్రీన్ టీలోని యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు LDL, మొత్తం కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.
ఓట్స్ కొలెస్ట్రాల్ శోషణ, కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి
టమోటాలలోని లైకోపీన్ అనే సమ్మేళనం లిపిడ్ స్థాయిలను మెరుగుపరిచి LDL కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
చాలా బెర్రీలలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి, ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.
ఆరెంజ్, అవకాడోలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో లేదా నియంత్రించడంలో సహాయపడే పదార్థాలు ఉంటాయి.
కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచుకోవాలనుకునేవారు సంతృప్త కొవ్వులు అధికంగా ఉన్న పానీయాలైన క్రీమ్, అధిక కొవ్వు పాలు నివారించాలి
కాఫీ లేదా టీలతో పాటు కొబ్బరి లేదా పామాయిల్‌లు కలిగిన పానీయాలు లేదా స్మూతీలు కూడా దూరం పెట్టాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు