వైఎస్సార్ కాపు నేస్తం పథకం.. జగన్ చేతులు మీదుగా ప్రారంభం

బుధవారం, 24 జూన్ 2020 (09:53 IST)
వైఎస్సార్ కాపు నేస్తం పథకాన్ని ఏపీ సీఎం జగన్ నేడు ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన పేద మహిళల్లో... 45 నుంచి 60 ఏళ్ల మధ్య వారికి... ఏడాదికి రూ.15వేలు ఇస్తామనీ... అలా ఐదేళ్లలో రూ.75 వేలు ఇస్తామని జగన్ ఎన్నికల హామీల్లో భాగంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించి సీఎం జగన్ బుధవారం తన క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కుతారు.
 
2,35,873 మంది మహిళల బ్యాంకు అకౌంట్లలోకి నేరుగా రూ.15 వేల చొప్పున మొత్తం రూ.354 కోట్లు జమ కానున్నాయి. నిజానికి కాపు వర్గం వారు ఓసీ కిందకు వస్తారు. కానీ... ఇప్పుడు కాపుల్లోనూ చాలా మంది కఠిక పేదలు ఉన్నారు. మరి వారిని ఆదుకోకపోతే కష్టమే అని భావించిన జగన్... కాపు వర్గం నేతలతో చర్చించి... ఎన్నికల సమయంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
 
ఇలా ఏడాదికి రూ.15వేలు ఇవ్వడం ద్వారా పేద కాపు వర్గం మహిళలను ఆర్ధికంగా ఆదుకోవడానికి వీలవుతుందని జగన్ నిర్ణయించారు. ఇప్పుడు అమలు చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా, వైసీపీకి ఓట్లు వేసారా లేదా వంటి అంశాలేవీ లేకుండా నిష్పక్షపాతంగా అర్హులను ఎంపిక చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు