Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

దేవీ

మంగళవారం, 2 సెప్టెంబరు 2025 (18:49 IST)
Bellamkonda Sai Srinivas, sathya, abi and others
బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ కథానాయకుడిగా కౌశిక్‌ పెగల్లపాటి దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రం కిష్కిందపురి. ఈ చిత్రం కోసం వేసిన సెట్లో ట్రైలర్ విడుదల చేయబోతున్నారు. తారాగణం పాల్గొన్న సెట్లోని వీడియోను విడుదలచేశారు. పురాతన బంగ్లాలోకి వెళ్లిన ఓ అమ్మాయి ఒక్కసారిగా అదృశ్యం అవుతుంది. ఇంతలో రేడియో నుంచి ఓ సమాచారం ప్రసారం అవుతుంది. ఇది ఇటీవల రిలీజ్ అయిన టీజర్‌ సారాంశం. రేపు విడుదలకాబోయే ట్రైలర్ అంతకుమించి వుంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. చైతన్‌ భరద్వాజ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ చేశారు.
 
అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. షైన్‌ స్ర్కీన్స్‌ బేనర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. సెప్టెంబరు 12న విడుదలకు సిద్ధమవుతోంది.  చిన్మయ్ సలాస్కర్ సినిమాటోగ్రఫీ, సామ్ CS హంటింగ్ స్కోర్‌తో అదిరిపోయింది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ నిర్మాణ విలువలు గ్రాండ్‌గా ఉన్నాయి, అతీంద్రియ అంశాల డెప్త్ ని ప్రజెంట్ చేసే VFX వర్క్ టాప్ క్యాలిటీతో ఆకట్టుకుంది.
 
ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైన్‌ను మనీషా ఎ దత్ నిర్వహిస్తున్నారు, డి. శివ కామేష్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. నిరంజన్ దేవరమానే ఎడిటర్. ఈ ప్రాజెక్ట్ క్రియేటివ్ హెడ్ జి. కనిష్క, సహ రచయిత దరాహాస్ పాలకొల్లు, స్క్రిప్ట్ అసోసియేట్ కె బాల గణేష్.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు