జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై వైకాపా ఎమ్మెల్యే ఆర్కే రోజా మరోమారు విమర్శనాస్త్రాలు సంధించారు. ఎవరైనా జీవించివుండగా తమ పేరును సంక్షేమ పథకాలకు పెట్టుకుంటారా? అంటూ సీఎం చంద్రబాబును రోజా నిలదీశారు.
ఇదే అంశంపై ఆమె మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ అధికారంలో ఉన్న ఏపీ రాష్ట్రంలో 21 ప్రభుత్వ పథకాలకు చంద్రబాబు పేరు పెట్టారని, బతికి ఉండగానే ఎవరైనా తమ పేర్లను పథకాలకు పెట్టుకుంటారా? అని ప్రశ్నించారు. చంద్రన్న మాల్స్ పేరుతో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని, రేషన్ షాపుల ఆధునికీకరణ కాంట్రాక్ట్‌ను ఫ్యూచర్ గ్రూపు సంస్థకు ఇవ్వడం వెనుక పరమార్థం లేకపోలేదన్నారు. ఫ్యూచర్ గ్రూపులో చంద్రబాబుకు వాటాలు ఉన్నాయన్నారు.
ఇకపోతే, జనసేన అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ ఓ గజినీలా మారిపోయారని, జగన్‌ని విమర్శించే నైతికహక్కు పవన్‌కి ఎంతమాత్రం లేదన్నారు. గత ఎన్నికల్లో టీడీపీని గెలిపించిన పవన్ కళ్యాణ్.. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనకు పవర్ లేకుండా పోయిందని విమర్శలు చేశారు. వారసత్వ రాజకీయాలపై మాట్లాడే పవన్‌కు కేసీఆర్, చంద్రబాబు కుటుంబాలు కనిపించడం లేదా?