ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో వైఎస్. జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా ముందంజలో ఉంది. గురువారం ఉదయం మొదలైన ఓట్ల లెక్కింపుల్లో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకుగాను వైకాపా 70 చోట్ల, టీడీపీ 20 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. అలాగే, లోక్‌సభ ఎన్నికల్లో కూడా వైకాపా ఒక చోట ఆధిక్యంలో ఉంది.
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన విషయం తెల్సిందే. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ లీడ్‌లో ఉంది. పోస్టల్, సర్వీస్ ఓట్ల లెక్కింపులో వైసీపీ జోరు కనిపించింది. వైసీపీ 70 అసెంబ్లీ స్థానాల్లో ముందు ఉంటే.. టీడీపీ 20 స్థానంలో మాత్రమే లీడ్‌లో ఉంది. లోక్‌సభ ఫలితాల విషయానికి వస్తే.. వైసీపీ ఆధిపత్యం కనిపిస్తోంది. ఆ పార్టీ ఒక స్థానంలో లీడ్‌లో ఉంది. ఇక జనసేన ఊసే లేదు.
మరోవైపు, సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. ఉదయం 9 గంటల ట్రెండ్స్ మేరకు 199 చోట్ల బీజేపీ కూటమి ఆధిక్యంలో ఉండగా, యూపీఏ 85, ఇతరులు 60 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. ఉన్నారు.