Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

చిత్రాసేన్

శుక్రవారం, 17 అక్టోబరు 2025 (18:55 IST)
Sidhu Jonnalagadda, Neerja Kona, Viva Harsha
సిద్ధు జొన్నలగడ్డ లేటెస్ట్ బ్లాక్ బస్టర్  తెలుసు కదా. మిరాయ్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్స్. ప్రముఖ స్టైలిస్ట్-ఫిల్మ్ మేకర్ నీరజా కోన దర్శకత్వం వహించారు.  అక్టోబర్ 17న గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం రన్ అవుతుంది. ఈ సందర్భంగా మేకర్స్ తన సంతోషాన్ని పంచుకున్నారు.
 
సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. తెలుసు కదా సినిమా నేను చేయాలని డిసైడ్ అయినప్పుడు నా మనసులో ఒక భయం ఉండేది. యాక్టర్ గా కాదు రైటర్ గా భయం ఉండేది.  ప్రతి సీన్లో పంచులు లేకపోతే థియేటర్ని హోల్డ్ చేయగలమా లేదా అనే భయం ఉండేది. ఈరోజు నాకు ఆ భయం పోయింది. తెలుసు కదా సినిమా ఇప్పుడే విమల్ థియేటర్లో చూసుకొని వస్తున్నాను. ఇలాంటి సినిమాకి ఆడియన్స్ ధియేటర్ కి వస్తారా లేదా అని భయం ఉండేది. ఈరోజు హౌస్ ఫుల్ షోస్ చూస్తుంటే మేము సక్సెస్ అయ్యామనే ఆనందం కలిగింది. సినిమాకి అన్ని చోట్ల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.  ఈ సినిమాని ఫ్రెండ్స్,  పేరెంట్స్, ఫ్యామిలీ ఎవరితో కలిసి వెళ్లిన సరే ఎంజాయ్ చేస్తారు. వరుణ్  మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాడు.  శ్రీనిధి రాశి హర్ష ఈ పాత్రలన్నీ మీకు కనెక్ట్ అవుతాయి. దీపావళిని సేఫ్ గా సెలబ్రేట్ చేసుకోండి. తప్పకుండా ఈ దివాళికి సినిమాకి వెళ్ళండి. తెలుసు కదా సినిమా ఈ దీపావళికి మీకు హ్యాపీ మెమోరీ అవుతుంది.
 
డైరెక్టర్ నీరజ కోన మాట్లాడుతూ..  ఇది నా ఫస్ట్ ఫిలిమ్. సినిమాకు వస్తున్నా రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఎమోషనల్ గా ఉంది. అందరి నుంచి అద్భుతమైన సపోర్టు వచ్చింది. ఆడియన్స్ సినిమాకు చానా అద్భుతంగా కనెక్ట్ అయ్యారు. ప్రీమియర్స్ నుంచి గ్రేట్ రియాక్షన్ వచ్చింది. మేము కనెక్ట్ అయిన పాయింట్ కి ఆడియన్స్ కూడా అంతే అద్భుతంగా కనెక్ట్ కావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది ఆడియన్స్ రెస్పాన్స్ కి థాంక్స్.  మా నిర్మాతలు విశ్వ గారు, కృతి, హిరో సిద్దు,  హీరోయిన్స్ రాశి  శ్రీనిధికి మా టెక్నీషియన్స్ అందరికీ థాంక్యూ వెరీ మచ్.  
 
వైవా హర్ష మాట్లాడుతూ.. సినిమాకి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. సినిమాకి క్లాస్ థియేటర్లో మాస్ థియేటర్లో విజిల్స్ పడుతున్నాయి. కంటిన్యూగా మెసేజ్లు వస్తున్నాయి .99% ఆక్యుఫెన్సీ తో సినిమా నడుస్తోంది. ఆడియన్స్  చాలా ఓన్ చేసుకుంటున్నారు. టిల్లు మీ అందరిని నవ్విస్తే వరుణ్ అందరికీ కనెక్ట్ అవుతాడు. అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చిన ఆడియన్స్ కి థాంక్యూ సో మచ్.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు