జాతక చక్రం ప్రకారం చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారా?

మంగళవారం, 21 మే 2019 (21:16 IST)
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ మే 23వ తేదీన వెల్లడికానున్నాయి. కానీ, ఎగ్జిట్ పోల్స్ మాత్రం కొందరికి అనుకూలంగా, మరికొందరికి వ్యతిరేకంగా వెల్లడయ్యాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు జాతకం ప్రకారం ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే యోగం ఉందా లేదా అనే విషయంపై ప్రముఖ ఆస్ట్రాలజర్ ప్రదీప్ జోషి ఏమంటున్నారో తెలుసుకుందాం. 
 
చంద్రబాబు జాతకరీత్యా యోగసంపన్నలు. ఆయన పూర్వాషాఢ నక్షత్రం, శుక్రమహర్ధశలో జన్మించారు. అద్భుతమైన యోగ లక్షణాలు కలిగివున్నారు. ఇవన్నీ ప్లస్ పాయింట్స్‌లోనే ఉన్నాయి. పైగా, ఏకాదశ స్థానంలో రాహువు ఉన్నారు. అంటే... ఇతరులకు కలగాల్సిన మేలు.. వారివారి జాతకరీత్యా నెగెటివ్‌గా మరి అది చంద్రబాబుకు అదృష్టంగా వరిస్తుంది. 
 
ఉదాహరణకు ఎన్టీఆర్ పార్టీని స్థాపించగా, ఆయన చేసిన కొన్ని తప్పులు చంద్రబాబుకు కలిసివచ్చి పార్టీతో పాటు... ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకున్నారు. అంటే వేరే వారికి నెగెటివ్ జరిగి అది చంద్రబాబు రాజయోగంగా వరిస్తుంది.
 
ఈ కారణంగానే 1995 నుంచి 2004 వరకు చంద్రబాబు అధికారంలో ఉన్నారు. ఆ సమయంలో చంద్రుడు భాగ్యస్థానంలో ఉన్నాడు. 1999 ఎన్నికలు ఆయనకు బాగా కలిసివచ్చాయి. 2004లో గురు మహర్ధశల్లో కేతువు ప్రారంభమయ్యాడు. ఫలితంగా ఆయన రాజయోగం పోయింది. 2014లో శని మహర్ధశ ప్రారంభమైంది. చంద్రబాబు జాతకంలో శని స్థానం సష్టమ స్థానంలో ఉన్నాడు. 
 
అశుభగ్రహాలు సష్టాష్టమ ద్వాదశస్థానంలో యోగిస్తాయి. అంటే.. ఇక్కడ కూడా కొన్ని ప్రతికూల పరిస్థితులు ఆయనకు అనుకూలించాయి. 2014లో తెలంగాణ విభజన జరగడం, నవ్యాంధ్రకు అనుభవజ్ఞుడైన సీఎం కావాలని భావించిన ప్రజలు చంద్రబాబుకు పట్టంకట్టారు. 2004లో నెగెటివ్ ఎక్కువ కారణంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లడం జరిగింది. దీనకితోడు వైఎస్ఆర్ పాదయాత్ర ఆయన్ను దెబ్బతీసింది. ఫలితంగా ఓడిపోయారు. 
 
కానీ, ప్రస్తుతం ఆయన గడ్డుకాలంలో ఉన్నారు. దీనికి కారణం శనిమహర్ధశ కేతువు వచ్చింది.  ఇపుడు శనిమహర్ధశల్లో కేతువు వచ్చాడు. గురువు కేతువు సపోర్టు చేయలేడు. శనిలో ఎలా సపోర్టు చేస్తాడని ప్రదీప్ జోషి ప్రశ్నిస్తున్నాడు. అయితే, చంద్రబాబు జాతకరీత్యా 3 అక్టోబరు 2018 నుంచి కేతువు అంతర్ధశ ప్రారంభమైంది. అంటే బుద్ధిమాంద్యం, నెగెటివ్ ఆలోచనలు, అత్యాశకు వెళ్లడం జరుగుతుంది.  
 
చంద్రబాబు జాతక రీత్యా స్వతఃసిద్ధంగా అద్భుతమైన ఆలోచనలు కలిగిన వ్యక్తి. రవి, కుజుడు బుద్ధుడు కలిసిన జాతకం. శుక్రుడు కూడా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఏపీలో తెలంగాణాలో మాదిరిగా కాంగ్రెస్‌తో చేతులు కలిపివున్నట్టయితే ఖచ్చితంగా చిత్తుగా ఓడిపోయివుండేవారు. కానీ, ఇపుడు ఆయన చేసిన అభివృద్ధే ఆయన్ను గెలిపించనుంది. అంతేకానీ, గ్రహాల అనుకూలతల కారణంగా గెలిచే ప్రసక్తేలేదు.
 
అలాగే, చంద్రబాబు అస్సలు నల్ల దుస్తులు ధరించరాదు. కానీ, ఆయన వాటిని వేసుకున్నారు. ఇది కొంతమేరకు మైనస్. అయినప్పటికీ.. ప్రస్తుతం ఆయన జాతకచక్రం రీత్యా 57 శాతానికి పైగా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నట్టు జ్యోతిష్య నిపుణులు ప్రదీప్ జోషి చెబుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు