ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల రాజకీయం రంజుగామారింది. అనేక మంది కీలక నేతలు తమకు అనుకూలంగా ఉండే స్థానాల్లో పోటీ చేస్తున్నారు. ఇలాంటి వారిలో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఒకరు. ఈయన గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో ప్రతి ఒక్కరి దృష్టి ఈ స్థానంపై కేంద్రీకృతమైంది. ఇక్కడ నుంచి వైకాపా అభ్యర్థిగా ఆళ్ళ రామకృష్ణా రెడ్డి పోటీ చేస్తున్నారు. అలాగే, జనసేన పార్టీ తరపున చల్లా శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు.
దీనిపై తమన్నా స్పందిస్తూ, ప్రజా సేవ చెయ్యాలనే సంకల్పంతో పోటీ చేయ్యాలని నిర్ణయించినట్టు చెప్పారు. జనసేన పార్టీ నాకు టిక్కెట్ ఇస్తుందని భావించానని, ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో ప్రతీ నియోజకవర్గం నుండి ట్రాన్స్‌జెండర్‌లు పోటీ చేయాలని ఆమె పిలుపునిచ్చారు.