శ్రీ కష్ణ కమిటీ ఓ దౌర్భాగ్య కమిటీ: పొన్నం ప్రభాకర్

FILE
ప్రత్యేక తెలంగాణపై నివేదిక సమర్పించిన శ్రీ కృష్ణ కమిటీ ఓ దౌర్భాగ్య కమిటీ అని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణకు సంబంధించి ఎంపీల మధ్య ఎలాంటి విభేదాలు లేవని పొన్నం శనివారం వ్యాఖ్యానించారు. తెలంగాణ ఆకాంక్షలను గౌరవించాలని కోర్ కమిటీకి వివరించామని పొన్నం చెప్పారు.

తెలంగాణకు భిన్నంగా నిర్ణయముంటే ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నడుచుకుంటామన్నారు. అధిష్టానం నిర్ణయం నచ్చని వాళ్లు పార్టీని వీడాలని, సొంత నిర్ణయాలు పార్టీపై రొద్దొదని పొన్నం తెలిపారు. తెలంగాణపై చిత్తశుద్దితో పనిచేస్తున్నామని ఆయన చెప్పారు.

ఇదిలా ఉంటే హస్తినలో కాంగ్రెస్ కోర్ కమిటీ అత్యవసర సమావేశం ఏర్పాటు కానుంది. ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో కోర్ కమిటీ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో తెలంగాణపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.

కానీ తెలంగాణ అజెండాతోనే కోర్ కమిటీ సమావేశం జరుగుతున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెబుతుంటే, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ గులాం నబీ ఆజాద్ ఢిల్లీలో లేనందున తెలంగాణపై చర్చ ఊహాగానాలేనని వార్తలు వస్తున్నాయి. ఇంకా నిన్న మీటింగ్‌కు కొనసాగింపే శనివారం నాటి కోర్ కమిటీ సమావేశమని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి.

వెబ్దునియా పై చదవండి