అక్బరుద్దీన్ పై కొత్త కేసుల వెల్లువ... 295ఏ, 298ఏ, 153ఏ సెక్షన్లు

శుక్రవారం, 11 జనవరి 2013 (21:24 IST)
FILE
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా పిటిషన్ల దాఖలు శరపరంపరంగా సాగుతూనే ఉన్నాయి. శుక్రవారంనాడు రాయచోటి మొదటి తరగతి మెజిస్ట్రేట్ కోర్టులో 295 ఎ, 298 ఎ, 153 ఎ సెక్షన్ల కింద కేసు నమోదైంది. అంతేకాదు చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి కోర్టులో కూడా కేసు నమోదయింది.

మరోవైపు శ్రీరాముని తల్లిపై అక్బరుద్దీన్ అనుచిత వ్యాఖ్యలు చేశారనీ, అలాంటి వ్యక్తి బహిరంగ సభల్లో మాట్లాడితే దేశ భద్రతకే ముప్పు వాటిల్లుతుందని ప్రభుదాస్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు.

తన ఫిర్యాదులో అక్బరుద్దీన్ ఇకపై బహిరంగ సభలో పాల్గొనకుండా చూడాలని కోరారు. శ్రీరాముని తల్లి గురించి అక్బరుద్దీన్ అనుచిత వ్యాఖ్యలు చేశారనీ, ఓ ప్రైవేట్ టీవీ ఛానల్ కూడా దీనిని ప్రసారం చేసిందని తెలిపారు.

గతంలో ఇస్లాంకు వ్యతిరేకంగా ఉన్న కొన్ని వ్యాఖ్యలను భారత ప్రభుత్వ నిషేధించిందనీ, అలాగే అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలను తక్షణమే అంతర్జాలం నుంచి తొలగించాలని కోరారు. ఈ ఫిర్యాదును అందుకున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై దర్యాప్తు చేస్తోంది.

వెబ్దునియా పై చదవండి