అధిక ధరలకు విక్రయించిన వ్యాపారుల అరెస్టు: సబిత

గురువారం, 1 ఏప్రియల్ 2010 (13:48 IST)
కర్ఫ్యూ సడలించిన పాతబస్తీ ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులను అధిక ధరలకు విక్రయించిన నలుగురు వ్యాపారులను పోలీసులు అరెస్టు చేసినట్టు హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆమె గురువారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. పాతబస్తీలో కర్ఫ్యూ సడలింపు ప్రాంతాల్లో 20 ట్రక్కుల్లో కూరగాయలు, 90 వేల లీటర్ల పాలను సరఫరా చేశామన్నారు.

పాతబస్తీ భద్రతలో ప్రస్తుతం 21 వేల కంపెనీల బలగాలు నిమగ్నమై ఉన్నాయని, మరో పది కంపనీల బలగాలను రాష్ట్రానికి పిలిపిస్తున్నట్టు ఆమె తెలిపారు. శుక్రవారం ప్రార్థన సమయంలో కర్ఫ్యూ సడలించే అంశంపై గురువారం సాయంత్రం మరోమారు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకుంటామని ఆమె తెలిపారు.

ఇదిలావుండగా 24 గంటల తర్వాత కర్ఫ్యూ సడలించడంతో నిత్యావసర వస్తువుల కోసం స్థానిక రోడ్లపైకి తండోపతండాలుగా తరలి వచ్చారు. ఇదే అదునుగా భావించిన వ్యాపారులు ధరలను అమాంతం పెంచేశారు. లీటరు పాల ధర వంద రూపాయల వరకు పలికింది. అలాగే, కూరగాయలు, బియ్యం ధరలు కేజీ రూ.50 నుంచి వంద రూపాయల వరకు విక్రయించారు.

వెబ్దునియా పై చదవండి