అహోబిలం శ్రీ నరసింహ క్షేత్రంలో ఎన్‌జిఆర్ఐ సర్వే!

కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలోని వైష్ణవాలయం శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో అపార సంపద బయటపడటంతో ఇపుడు.. కర్నూలు జిల్లాలోని నల్లమల అడవిలో వెలసిన అహోబిల నరసింహ క్షేత్రంలో అపార సంపద ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ సంపదపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు నేషనల్ జియోగ్రాఫికల్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌జిఆర్‌ఐ) సర్వే నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఆలయం కింద శ్రీ కృష్ణదేవరాయలు భారీ సంపదను నిక్షిప్తం చేసినట్లు సమాచారం. ఇక్కడి సంపదను వెలికి తీసేందుకు కొందరు కోర్టు ద్వారా ప్రయత్నాలు కూడా చేశారు.

అయితే ఈ నిధిని వెలికి తీసే ప్రయత్నం చేస్తే భక్తుల నుంచి వ్యతిరేకత వస్తుందని తెలుస్తోంది. అసలు నిధి ఉందో లేదో తేల్చితే తప్ప ఆ తర్వాతి పరిణామాల గురించి చర్యలు తీసుకోవడం వీలు కాదని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఎగువ అహోబిలం ఆలయం కింద సుమారు 15 టన్నుల బంగారు ఉన్నట్లు చరిత్ర చెబుతోందని వాదిస్తున్నారు. అయితే ఈ సంపదను వెలికితీస్తే పెనుముప్పు వస్తుందని కూడా భక్తులు విశ్వసిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి