ఎమ్మెల్యే రామారావు అరెస్టుకు సీఐడీ యత్నం!

గురువారం, 9 జులై 2009 (12:58 IST)
FileFILE
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కోవ్వూరు ఎమ్మెల్యే టీవీ.రామారావు అరెస్టుకు రాష్ట్ర సీఐడీ పోలీసులు గురువారం ప్రయత్నిస్తున్నారు. రామారావు నడుపుతున్న నర్సింగ్ కళాశాలలో చదువుకున్న కేరళ రాష్ట్రానికి చెందిన ముగ్గురు విద్యార్థినులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు అరెస్టుకు సిద్ధపడుతున్నారు.

నర్సింగ్ కళాశాలలో విద్యార్ధినిపై అత్యాచారం చేసి, హత్య చేశారని ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై పోలీస్ స్టేషన్‌లో దాఖలైన కేసులో ఆధారాలు లభించలేదు. అందువల్ల ఎమ్మెల్యే రామారావును ఇంతవరకు పోలీసులు అరెస్టు చేయలేదు. కానీ కేరళ నుంచి హైదరాబాద్ వచ్చిన ఐదుగురు విద్యార్థినుల్లో ముగ్గురు రామారావుపై అత్యచారయత్నం చేసినట్లు హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఫిర్యాదు చేశారు.

ఇది నిజమేనని మరో ఇద్దరు విద్యార్థినులు సాక్ష్యం చెప్పారు. ఈ కేసును పరిశోధించిన సీఐడీ ప్రాధమిక విచారణ పూర్తి చేసి నివేదికను సమర్పించింది. సీఐడీ అదనపు డీజీ శివన్నారాయణ బుధవారం రాష్ట్ర డీజీపీ యాదవ్‌ను కలిసి కేసును గురించి వివరించారు. రామారావు తనయుడు శేఖర్‌పైన కూడా కేసును నమోదు చేశారు. కాగా అరెస్టు తప్పదని సమాచారం రావడంతో రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపట్టాలని తెలుగుదేశం నిర్ణయించింది.

వెబ్దునియా పై చదవండి