రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ గాంధీ సిద్ధాంతాలకు తిలోదకాలు ఇస్తోందని ప్రముఖ సామాజిక సేవకురాలు, నర్మదా బచావో ఉద్యమ నేత మేథా పాట్కర్ విమర్శించారు. పేదలకు ఇళ్ల స్థలాలివ్వాలని కోరుతూ నగరంలో కొన్ని ప్రజా సంఘాలు గురువారం నిర్వహించిన ఆందోళన కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో నూతనంగా నిర్మించ తలపెట్టిన గాంధీ భవన్ కోసం మురికివాడల ప్రజలను ఖాళీ చేయించటం తగదని ఆమె చెప్పారు.
మురికి వాడల్లో నివశిస్తున్న ప్రజలకు సరైన ప్రత్యామ్నాయం చూపించిన తర్వతే గాంధీ భవన్ నిర్మాణాన్ని చేపట్టాలని ఆమె ప్రభుత్వానికి సూచించారు. ప్రత్యమ్నాయం చూపించకుండా భవనాన్ని నిర్మించటానకి యత్నిస్తే తాము తీవ్రంగా ప్రతిఘటస్తామని ఆమె కాంగ్రెస్ పార్టీని హెచ్చరించారు. గాంధేయ వాదులమని చెప్పుకుంటున్న కాంగ్రెస్ వారు గాంధీ పేరుతో నిర్మించాలనుకుంటున్న భవనం కోసం పేదలను ఖాళీ చేయించటం గాంధీ సిద్ధాంతాలకు తిలోదాలకాలు ఇవ్వటమే అవుతుందని మేథా పాట్కర్ పేర్కొన్నారు.