Naga Shaurya : బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగశౌర్య, విధి ఫస్ట్ సింగిల్

దేవీ

శుక్రవారం, 8 ఆగస్టు 2025 (18:00 IST)
Naga Shaurya, Vidhi
హీరో నాగశౌర్య అప్ కమింగ్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ బ్యాడ్ బాయ్ కార్తీక్. ఈ మూవీకి రామ్ దేశినా (రమేష్) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నాగశౌర్య జోడిగా విధి హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై  శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్నారు. నాగ శౌర్య క్యారెక్టర్ ఇంటెన్స్ నేచర్ ని ప్రజెంట్ చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.
 
మేకర్స్ ఫస్ట్ సింగిల్ నా మావ పిల్లనిత్తానన్నాడే సాంగ్ రిలీజ్ చేసి మ్యూజిక్ ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేశారు. ఈ సాంగ్ ని మెలోడీ మాస్టర్ హారిస్ జయరాజ్  వైబ్రెంట్ అండ్ పుట్ టాపింగ్ నెంబర్ గా కంపోజ్ చేశారు. కాసర్ల శ్యామ్ రాసిన లిరిక్స్ మాస్ ని ఆకట్టుకునేలా వున్నాయి. కారుణ్య, హరి ప్రియ తమ ఎనర్జిటిక్ వోకల్స్ తో మెస్మరైజ్ చేశారు.
 
ఈ సాంగ్ లో నాగశౌర్య, విధి కెమిస్ట్రీ కలర్ ఫుల్ గా వుంది. నాగశౌర్య డ్యాన్స్ మూమెంట్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సాంగ్ కి సోషల్ మీడియాలో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో సముద్రఖని, సీనియర్ నరేష్, సాయికుమార్, వెన్నెల కిషోర్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్ కుమార్, వెన్నెల కిషోర్ వంటి ప్రముఖ తారాగణం కీలక పాత్రలు పోషిస్తున్నారు.
 
ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ డీవోపీగా పని చేస్తున్నారు. రామాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్ కాగ, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్.
 
నటీనటులు: నాగ శౌర్య, విధి, సముద్రఖని, సీనియర్ నరేష్, సాయికుమార్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్ కుమార్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, పృథ్వీ, అజయ్, ప్రియ, నెల్లూరు సుదర్శన్, కృష్ణుడు, చమక్ చంద్ర, శివన్నారాయణ

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు