జగన్ - విజయమ్మ రాజీనామా : ప్రజలకు 7 పేజీల లేఖ

శనివారం, 10 ఆగస్టు 2013 (17:20 IST)
File
FILE
రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానానికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కడప ఎంపీ పదవికి, ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పులివెందుల శాసనసభ్యత్వానికి శనివారం రాజీనామా చేశారు. వారి రాజీనామా లేఖలను స్పీకర్ ఫార్మెట్‌లో రాసి ఆయా సభల సభాపతులకు పంపించారు.

ఈ రాజీనామాలపై ఆ పార్టీ సీనియర్ నేతలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, మైసూరా రెడ్డి, అంబటి రాంబాబులు మీడియాతో మాట్లాడుతూ... జగన్మోహన్ రెడ్డి రాజీనామా లేఖను లోక్సభ స్పీకర్కు ఫాక్స్ ద్వారా జైలు వర్గాలే పంపించినట్టు చెప్పారు. జగన్ను రాజకీయంగా ఎదుర్కోలేకే డ్రామాలు ఆడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రజలకు జగన్, విజయమ్మ ఏడు పేజీల లేఖ రాసినట్లు తెలిపారు.

ఓట్లు, సీట్లు ప్రాతిపదికన రాష్ట్రాన్ని విభజిస్తున్నారని ఆ పార్టీ నేత మైసూరా రెడ్డి ఆరోపించారు. ఏ పరిష్కారం చూపకుండా కాంగ్రెస్ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిందన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని తాము కోరుతున్నట్లు తెలిపారు. పరిష్కారం చూపిన తర్వాతే రాష్ట్రాన్ని విభజించాలని ఆది నుంచి డిమాండ్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు.

వెబ్దునియా పై చదవండి