బిర్యానీలో టేస్ట్ కోసం తీసుకుంటే.. అందులోని అధిక కెలోరీలు, మసాలాలు, సోడియం, ఉప్పు శరీరానికి ఇబ్బందులను తెచ్చి పెడతాయి. ఇంకా ఎప్పుడుపడితే అప్పుడు తినివారికి ఎలాంటి సమస్యలు ఏర్పడతాయో చూద్దాం...
బిర్యానీలు వారానికి ఓసారైతే పర్లేదు కానీ అదే పనిగా రెండు రోజులకు ఒకసారి.. రాత్రిపూట తీసుకుంటే అందులోకి అధిక కెలోరీలు ఒబిసిటీకి దారితీస్తుంది. తద్వారా మధుమేహం సమస్య తప్పదు. బిర్యానీల్లో అధిక కొవ్వు వుండటంతో రక్తపోటు తలెత్తే ఆస్కారం వుంది. ఇది గుండె సంబంధిత రోగాలకు దారితీస్తుంది. ఇందులోని సోడియం అధిక రక్తపోటుకు కారణం అవుతుంది. ఇది కిడ్నీ సంబంధిత రోగాలు, పక్షవాతానికి దారితీస్తాయి.
ఇంకా బిర్యానీల్లో వాడే అధిక మోతాదు నూనెల కారణంగా, మసాలాల కారణంగా అజీర్ణ సమస్యలు, కడుపులో మంట వంటి రుగ్మతలు తప్పవు. బిర్యానీలోని పదార్థాలు ముఖ్యంగా మాంసం క్యాన్సర్‌కు దారితీస్తాయి. అందుచేత బిర్యానీని మితంగా తీసుకుంటే మంచిది. లేకుంటే ఇబ్బందులు తప్పవు. బిర్యానీకి బదులు కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలను డైట్‌లో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారమవుతాం.